కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ ప్రాంతీయ ఆసుపత్రిని వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. వైద్యులు, నాయకులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఆసుపత్రిలోని పలు విభాగాలను పరిశీలించిన ఆయన... ఆర్‌ఎంవో డాక్టర్ శ్రీకాంత్‌రెడ్డిని పలు వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆరోగ్యశ్రీ సేవలపై ఆరా తీశారు. రోగులకు అందిస్తున్న సేవలను గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రిలో సేవలు పొందుతున్న రోగులతో మంత్రి మాట్లాడారు. ప్రభుత్వాసుపత్రిల్లో నాణ్యమైన వైద్య సేవలను అందించాలన్నారు.
హుజూరాబాద్ ఆస్పత్రిలో మంత్రి ఆకస్మిక తనిఖీ - హుజూరాబాద్ ఆస్పత్రిలో వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ ఆకస్మిక తనిఖీలు
కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ ప్రాంతీయ ఆస్పత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్.
హుజూరాబాద్ ఆస్పత్రిలో మంత్రి ఆకస్మిక తనిఖీ