తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత హుజూరాబాద్‌కు రూ.50కోట్లు, జమ్మికుంటకు రూ.40కోట్లు విడుదల చేస్తూ మొదటి జీవో తెచ్చుకున్నామని వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంట మున్సిపల్ ఛైర్మన్‌గా తక్కలపల్లి రాజేశ్వర్‌రావు పదవీ బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. ఛైర్మన్ రాజేశ్వర్‌రావు, వైస్ ఛైర్మన్ స్వప్నను శాలువలతో సత్కరించారు.
మిషన్ భగీరథ త్వరలోనే పూర్తి : ఈటల రాజేందర్ - karimnagar latest news
మిషన్ భగీరథ పనులను త్వరలోనే పూర్తి చేస్తామన్నారు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్. కరీంనగర్ జిల్లా జమ్మికుంట మున్సిపల్ ఛైర్మన్‌గా తక్కలపల్లి రాజేశ్వర్‌రావు పదవీ బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి హాజరయ్యారు.
నిధులన్ని ఖర్చువుతున్నాయని, వాటి ఫలితాలు ఇంకా పూర్తిగా అందలేదన్నారు. మిషన్ భగీరథ పనులను త్వరలోనే పూర్తి చేస్తామని చెప్పారు. జమ్మికుంట ప్రజలు ఎదుర్కొంటున్న నీటి సమస్యను ఈ పాలకమండలి సంపూర్ణంగా తీర్చాలని ఆకాక్షించారు. ప్రజలకు ఏ చిన్న సమస్య ఉన్నా ఆ సమస్యను పరిష్కరించే వెసలుబాటు పాలకమండలికి ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీ ఛైర్‌పర్సన్ కనుమల్ల విజయ, మాజీ ఎమ్మెల్యే ఆరెపల్లి మోహన్ తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి :ఎడ్లబండ్లకు కూడా రేడియం స్టిక్కర్స్ అంటించుకోవాలి