సర్పంచ్‌లు గ్రామాలకు మొదటి పౌరులని, ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు వారు ముందుండాలని వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్‌లో పర్యటించిన ఆయన.. మండల పరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సర్వసభ్య సమావేశానికి హాజరయ్యారు. 51 మంది లబ్ధిదారులకు మంజూరైన కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను ఈ సమావేశంలో మంత్రి అందజేశారు.
'గ్రామాల ప్రజాప్రతినిధులు ప్రజలకు అందుబాటులో ఉండాలి' - kalyana lakshmi shaadi mubarak cheques distribution
కరీంనగర్ జిల్లా హుజూరాబాద్‌లో మంత్రి ఈటల రాజేందర్ పర్యటించారు. మండల పరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సర్వసభ్య సమావేశానికి ఆయన హాజరయ్యారు. గ్రామాల ప్రతినిధులు ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉండాలని ఈటల సూచించారు. అనంతరం లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు.
'గ్రామాల ప్రజాప్రతినిధులు ప్రజలకు అందుబాటులో ఉండాలి'
గ్రామాల ప్రజాప్రతినిధులు ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలని ఈటల పేర్కొన్నారు. ప్రజలకు మౌలిక వసతులను కల్పించాలని చెప్పారు. రైతులు ఈ సారి కూడా సన్నరకాలను సాగు చేశారని.. కేంద్ర ప్రభుత్వం సన్నరకాలతో పాటు దొడ్డు రకాల ధాన్యాన్ని కూడా కొనుగోలు చేస్తుందని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ రాణి, అధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి:కొత్త కార్పొరేటర్లతో నేడు కేటీఆర్ భేటీ