రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్నప్పటికీ ఆందోళన అవసరం లేదని, అప్రమత్తంగా ఉండాలని వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ పేర్కొన్నారు. కరీంనగర్ జిల్లా తనుగుల రైతువేదిక ప్రారంభోత్సవంలో ఆయన పాల్గొన్నారు.
'కరోనా కేసులపై ఆందోళన వద్దు.. అప్రమత్తంగా ఉన్నాం'
కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మంత్రి ఈటల రాజేందర్ పేర్కొన్నారు. వైరస్ తీవ్రతపై ఆందోళన అవసరం లేదన్నారు. వైద్యారోగ్య శాఖ పూర్తి అప్రమత్తంగా ఉందని స్పష్టం చేశారు.
'కరోనా కేసులపై ఆందోళన వద్దు.. అప్రమత్తంగా ఉన్నాం'
మహారాష్ట్ర నుంచి వచ్చే వారి ద్వారా రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్నాయని మంత్రి పేర్కొన్నారు. అయినప్పటికీ ఆందోళన అవసరం లేదని, వైద్యారోగ్యశాఖ పూర్తి అప్రమత్తంగా ఉందని తెలిపారు. వ్యాక్సిన్ వల్ల ప్రయోజనం ఉందా లేదా అన్న అంశం ఇప్పుడే తేలకపోయినప్పటికీ.. విరివిగా అందరికీ టీకా ఇవ్వాలని కేంద్రాన్ని కోరతామని వెల్లడించారు.