కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గంలో వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ పర్యటించారు. హుజూరాబాద్ మండలం మంథెనపల్లి గ్రామాన్ని మంత్రి ఈటల సందర్శించారు. సర్పంచి పోరెడ్డి రజిత, ఎంపీటీసీ వైద్యుల శిరీష ఆయనకు స్వాగతం పలికారు. మహిళలు కోలాట నృత్య ప్రదర్శన చేశారు. స్థానిక నాయకులు, గ్రామస్థులతో మంత్రి మాట్లాడి పలు సమస్యలను అడిగి తెలుసుకొన్నారు.
కల్యాణలక్ష్మి చెక్కులు అందజేసిన మంత్రి ఈటల - Eerala rajender updates
కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గంలోని మంథెనపల్లి గ్రామాన్ని వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ సందర్శించారు. స్థానిక నాయకులు, గ్రామస్థులతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకొన్నారు.

ఇటీవల జరిగిన అభివృద్ధి పనులను మంత్రి పరిశీలించారు. సీసీ రోడ్లు, వైకుంఠధామం మంజూరు చేయాలంటూ సర్పంచి, ఎంపీటీసీ వినతిపత్రం సమర్పించగా... మంత్రి హామీ ఇచ్చారు. అనంతరం క్యాంపు కార్యాలయంలో హుజూరాబాద్ మండలానికి చెందిన 38 మంది లబ్దిదారులు షాదీ ముబారక్, కల్యాణలక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్‌పర్సన్ గందె రాధిక, వైస్ ఛైర్‌పర్సన్ కొలిపాక నిర్మల, ఎంపీపీ రాణి, ప్రజాప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి:ఏ ప్రాంతంలో ఎన్నికలుంటే... ఆ ప్రాంతానికి నిధులా..?: శ్రీధర్‌బాబు