కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గంలో మంత్రి ఈటల రాజేందర్ పర్యటించారు. వీణవంక మండలం పోతిరెడ్డిపల్లి, కల్లుపల్లిలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ఆయన ప్రారంభించారు. నూతనంగా నిర్మించిన వైకుంఠధామం, డంపింగ్‌యార్డులను పరిశీలించారు. స్థానిక ప్రజాప్రతినిధులను పలు వివరాలు అడిగి తెలుసుకొన్నారు.
'ఎలాంటి పరిస్థితులొచ్చినా సమర్థవంతంగా ఎదుర్కొంటాం'
కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను మంత్రి ఈటల రాజేందర్ ప్రారంభించారు. అనంతరం పాస్టర్స్ ఫెలోషిప్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కరోనా విపత్కర పరిస్థితుల్లో ప్రజలంతా ధైర్యంగా ఉండాలని ప్రజలకు ఈటల సూచించారు.
'ఎలాంటి పరిస్థితులొచ్చినా సమర్థవంతంగా ఎదుర్కొంటాం'
అనంతరం మండల కేంద్రంలో 'పాస్టర్స్ ఫెలోషిప్' ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన క్రిస్మస్ వేడుకల్లో ఈటల పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిరుపేదలకు దుస్తులు పంపిణీ చేశారు. కరోనా ఇప్పటికే కొన్నినెలల పాటు అందరిని దూరం చేసిందని.. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలని మంత్రి సూచించారు. ఎలాంటి పరిస్థితులు వచ్చినప్పటికీ సమర్థవంతంగా ఎదుర్కొనే శక్తి ప్రభుత్వానికి ఉందని పేర్కొన్నారు.