ప్రజలు పెట్టిన భిక్షతోనే పదవులు వచ్చాయని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. గులాబీ కండువా వల్లే మనకు గుర్తింపు వచ్చిందని స్పష్టం చేశారు. కరీంనగర్ జిల్లా హుజురాబాద్ మండలం శాలపల్లిలో జరిగిన హుజురాబాద్, జమ్మికుంట మున్సిపాలిటీల తెరాస కార్యకర్తల సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
నన్ను వెన్నుపోటు పొడిచిందెవరో తెలుసు: ఈటల - minister eetala emotional speech
ప్రజలు పెట్టిన భిక్ష, గులాబీ కండువాతోనే పదవులు, గుర్తింపు వచ్చిందని మంత్రి ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. కరీంనగర్ జిల్లా శాలపల్లిలో జరిగిన కార్యకర్తల సమావేశానికి మంత్రి హాజరయ్యారు. నమ్మిన వారే వెన్నుపోటు పోడిస్తే ఎంతో బాధగా ఉంటుందని ఆవేదన వ్యక్తం చేశారు.
నన్ను వెన్నుపోటు పొడిచిందెవరో తెలుసు: ఈటల
డబ్బుంటే ఓట్లు పడతాయనుకోవటం తప్పని.. ప్రజల అభిమానంతోనే గెలుస్తామని ఈటల తెలిపారు. గత ఎన్నికల్లో నా వెంటే ఉండి వెన్నుపోటు పొడిచెందెవరో తనకు తెలుసున్న ఈటల.. నమ్మినవారు మోసం చేస్తే బాధగా ఉంటుందన్నారు. రాబోయే పురపాలక ఎన్నికల్లో గులాబీ జెండా ఎగురవేసేందుకు శక్తివంచన లేకుండా కృషి చేయాలని కార్యకర్తలకు సూచించారు.
ఇవీచూడండి: 'నేను సీఎం అవుతాననే చర్చే అవసరం లేదు"