కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గంలో మంత్రి ఈటల రాజేందర్ పర్యటించారు. నియోజకవర్గంలోని కమలాపూర్, జమ్మికుంట మండలాల్లోని సమ్మక్క సారలమ్మ జాతరను సందర్శించారు. సమ్మక్క, సారలమ్మలకు నిలువెత్తు బంగారాన్ని సమర్పించారు.
మేడారంలో మొక్కు చెల్లించుకున్న మంత్రి ఈటల - మంత్రి ఈటల రాజేందర్
కరీంనగర్ జిల్లాలోని కమలాపూర్, జమ్మికుంట మండలాల్లోని సమ్మక్క సారలమ్మను మంత్రి ఈటల దర్శించుకున్నారు. దేవతలకు నిలువెత్తు బంగారాన్ని సమర్పించారు. జాతర ఏర్పాట్లను పరిశీలించారు.

సమ్మక్క సారలమ్మకు ఈటల ఎత్తు బంగారం సమర్పణ
సమ్మక్క సారలమ్మకు ఈటల ఎత్తు బంగారం సమర్పణ
అమ్మవారికి మంత్రి మొక్కులు చెల్లించారు. టెంకాయలు కొట్టారు. ప్రత్యేక పూజలు చేశారు. జాతర ఏర్పాట్లను పరిశీలించారు. కమలాపూర్‌లో ఏర్పాటు చేసిన వైద్య శిబిరాన్ని మంత్రి ఈటల ప్రారంభించారు.
ఇవీ చూడండి:సమ్మక్క, సారలమ్మ సన్నిధిలో కేసీఆర్... పట్టు వస్త్రాల సమర్పణ