కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గంలో వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ పర్యటించారు. హుజూరాబాద్, వీణవంక, జమ్మికుంట, ఇల్లందకుంట మండలాల్లోని పలు గ్రామాల్లో మహిళా సంఘాలు, సింగిల్‌విండో ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను... జడ్పీ ఛైర్పర్సన్ కనుమల్ల విజయతో కలిసి ప్రారంభించారు.
రైతులు ధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి: ఈటల - ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన మంత్రి ఈటల రాజేందర్
ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో... జడ్పీ ఛైర్పర్సన్ విజయతో కలిసి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించారు.
![రైతులు ధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి: ఈటల minister eetala rajendar opened paddy purchase centers in huzurabad constituency](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9329515-147-9329515-1603794897531.jpg)
రైతులు ధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి: ఈటల
ధాన్యం తూకాలు వేసి, నిల్వలు పరిశీలించి, రైతులతో, నిర్వాహకులతో మంత్రి మాట్లాడారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా... కేంద్రాలను సజావుగా నిర్వహించాలని నిర్వాహకులకు సూచించారు. కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని రైతులను కోరారు.
ఇదీ చూడండి:దోమపోటు సోకిందని పంటకు నిప్పంటించిన రైతు