కరోనా వ్యాప్తి నేపథ్యంలో రంజాన్ పండుగను అందరూ తమ ఇళ్లలోనే జరుపుకోవాలని వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ ముస్లింలను కోరారు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గంలో తన క్యాంపు కార్యాలయంలో మొదటి విడత రుణమాఫి చెక్కులను పలువురు రైతులకు అందజేశారు.
రైతు రుణమాఫి చెక్కులను పంపిణీ చేసిన మంత్రి ఈటల
హుజూరాబాద్ నియోజకవర్గంలో పలువురు రైతులకు మంత్రి ఈటల రాజేందర్ రైతు రుణమాఫి చెక్కులను పంపిణీ చేశారు. మత సామరస్యానికి ప్రతీక రంజాన్ పండుగ అని మంత్రి పేర్కొన్నారు. ప్రజలందరికీ రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు.
Karimnagar district latest news
జమ్మికుంటలోనూ పలువురు అన్నదాతలకు రుణమాఫి చెక్కులను పంపిణీ చేశారు. హుజూరాబాద్ మండలంలో 437 మంది రైతులకు గానూ రూ.68.23లక్షలు మంజూరయ్యాయని అధికారులు తెలిపారు. కార్యక్రమంలో జడ్పీ ఛైర్‌పర్సన్ కనుమల్ల విజయతోపాటు పలువురు తెరాస నేతలు పాల్గొన్నారు.