తెలంగాణ

telangana

ETV Bharat / state

'రైతువేదికలు నూతన వ్యవసాయానికి నాంది పలకాలి' - telangana latest news

రైతు వేదికలు నూతన వ్యవసాయానికి నాంది పలకాలని మంత్రి ఈటల రాజేందర్​ పేర్కొన్నారు. రైతులు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని వ్యాఖ్యానించారు. అన్నదాతలంతా కలిసికట్టుగా పని చేసి, అధిక దిగుబడులు సాధించాలని ఆకాంక్షించారు. కరీంనగర్​ జిల్లా మడిపల్లిలో రైతు వేదిక భవనాలను మంత్రి ప్రారంభించారు.

Minister eetala inaugurating raithu vedika buildings at Madipalli
'రైతువేదికలు నూతన వ్యవసాయానికి నాంది పలకాలి'

By

Published : Mar 20, 2021, 9:33 PM IST

రైతులు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ పేర్కొన్నారు. రైతులంతా కలిసికట్టుగా వ్యవసాయం చేసుకోవాలని సూచించారు. కరీంనగర్‌ జిల్లా జమ్మికుంట మండలంలోని పలు గ్రామాల్లో మంత్రి పర్యటించారు. స్థానిక తెరాస నాయకులు ఆయనకు ఘన స్వాగతం పలికి, జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మడిపల్లిలో నిర్మించిన రైతు వేదిక భవనాలను మంత్రి ప్రారంభించారు.

వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్ అందించిన ఘనత తెరాస ప్రభుత్వానికే దక్కుతుందని మంత్రి పేర్కొన్నారు. రైతులంతా కలిసికట్టుగా పని చేసి, అధిక దిగుబడులు సాధించాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా రైతు వేదికలు నూతన వ్యవసాయానికి నాంది పలకాలన్న ఆయన.. ఈ వేదికలు రీసెర్చ్​ సెంటర్లుగా నిలవాలని తెలిపారు.

ఇదీ చూడండి: రాష్ట్ర ప్రజలు సీఎం కేసీఆర్ పక్షానే ఉన్నారు : హరీశ్ రావు

ABOUT THE AUTHOR

...view details