కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ పర్యటించారు. జమ్మికుంట పాత వ్యవసాయ మార్కెట్ యార్డులో రూ.1.4 కోట్లతో నిర్మించిన రైతు బజార్‌ను ఆయన ప్రారంభించారు. మార్కెట్ కమిటీ పాలకవర్గం మంత్రిని గజమాలతో ఘనంగా సత్కరించింది. రాష్ట్రంలోని పేదలందరికి నాణ్యమైన వైద్య సేవలందించేందుకు కృషిచేస్తున్నామని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో ఒక్కో విద్యార్థిపైన రూ.1.05 లక్షలు ఖర్చుచేస్తున్నట్లు తెలిపారు. పేదరికానికి. ఆకలికి, కష్టానికి పరిష్కారం చూపే బిడ్డగా ఈటల రాజేందర్ ఉంటారని హామీ ఇచ్చారు.
జమ్మికుంటలో రైతు బజార్ ప్రారంభించిన మంత్రి ఈటల - జమ్మికుంట
కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో రైతు బజార్‌ను రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ ప్రారంభించారు. పేదలకు నాణ్యమైన విద్య, వైద్యం అందించేందుకు నిరంతరం కృషిచేస్తున్నామని మంత్రి తెలిపారు.
జమ్మికుంటలో రైతు బజార్ ప్రారంభించిన మంత్రి ఈటల