పల్లె ప్రగతి కార్యక్రమం బాగా అమలైతే మొదట సంతోషపడేది తన శాఖేనని వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్‌లో రెండో విడత నియోజకవర్గ స్థాయి పల్లె ప్రగతి కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ప్రణాళికబద్ధంగా కార్యక్రమాలు అమలుచేయాలని అధికారులకు సూచించారు. అందుకు ఎంత నగదు ఖర్చయినా భరించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. ప్రజలకు నచ్చే పనులు చేపట్టి.. వారి మెప్పు పొందాలని సూచించారు. బతికున్నవరకు కరీంనగర్‌కు మచ్చతెచ్చే పనిచేయనని స్పష్టం చేశారు.
బతికున్నవరకు మచ్చతెచ్చే పనిచేయను: ఈటల
పల్లె ప్రగతి కార్యక్రమం చక్కగా అమలైతే తన శాఖే తొలుత సంతోషిస్తుందని మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. హుజూరాబాద్‌లో జరిగిన రెండో విడత పల్లె ప్రగతి కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు.
బతికున్నవరకు మచ్చతెచ్చే పనిచేయను: ఈటల
అనంతరం కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. పల్లె ప్రగతి కార్యక్రమం గోడ పత్రికలు, పుస్తకాలను మంత్రి ఆవిష్కరించారు. అనంతరం నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుతూ కేక్ కట్ చేశారు.
ఇవీచూడండి: కమిషనర్‌తో నేనే మాట్లాడా.. దురుసుగా ప్రవర్తించారు: ఉత్తమ్