పని చేసే వారిని ప్రోత్సహించటమే రాష్ట్ర ప్రభుత్వ మొదటి ప్రాధాన్యమని మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్‌లోని క్యాంపు కార్యాలయంలో జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో స్వశక్తి మహిళా సంఘాల సభ్యులకు వ్యవసాయ, వ్యవసాయ అనుబంధ, వ్యవసాయేతర అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. హుజూరాబాద్, కమలాపూర్ మండలాలకు చెందిన స్వశక్తి మహిళా సంఘాల సభ్యులు ఏర్పాటు చేసిన పలు స్టాళ్లను మంత్రి సందర్శించారు. ఉత్పత్తి దారులను పలు వివరాలు అడిగి తెలుసుకున్నారు.
మహిళా సంఘాలపై పూర్తి విశ్వాసం ఉంది: మంత్రి ఈటల
కరీంనగర్ జిల్లా హుజూరాబాద్‌లోని క్యాంపు కార్యాలయంలో జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో స్వశక్తి మహిళా సంఘాల సభ్యులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. హుజూరాబాద్, కమలాపూర్ మండలాలకు చెందిన స్వశక్తి మహిళా సంఘాల సభ్యులు ఏర్పాటు చేసిన పలు స్టాళ్లను మంత్రి సందర్శించారు.
మనిషి ఊరికే కూర్చోలేడని... చేవ ఉన్నంత వరకు పని చేస్తూనే ఉంటాడని మంత్రి ఈటల తెలిపారు. మహిళా సంఘాలపై పూర్తి విశ్వాసం ఉందని స్పష్టం చేశారు. హుజూరాబాద్ చిత్ర పటాన్ని రాష్ట్రంలో గొప్పగా నిలిపే ప్రయత్నంలో మీరంతా సహాయ సహాకారాలు అందించాలని మంత్రి విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో జిల్లా పాలనాధికారి శశాంక, అదనపు కలెక్టర్ ఏనుగు నర్సింహారెడ్డి, మున్సిపల్ ఛైర్మన్లు గందె రాధిక, తక్కలపల్లి రాజేశ్వర్‌రావు, ఎంపీపీ రాణి, వైస్ ఛైర్‌పర్సన్ కొలిపాక నిర్మాల, పీడీ వెంకటేశ్వర్‌రావు, ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.