రాష్ట్రంలో పంటల కొనుగోళ్లు, ఎగుమతి, దిగుమతులపై ముఖ్యమంత్రి జిల్లాల వారీగా మంత్రులు, అధికారులతో ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారని మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో మొక్కజొన్నల దిగుమతి కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ఈ ఏడాది పంటలు బాగా పండాయని మంత్రి సంతోషం వ్యక్తం చేశారు. కొనుగోలు కేంద్రాలను పంటను తీసుకొచ్చేటప్పుడు శుభ్రం చేసి తీసుకురావాలడం వల్ల పంటకు మంచి ధర వస్తుందని సూచించారు.
పంట కొనుగోళ్లలో జాప్యం వద్దు: ఈటల - కరీంనగర్ జిల్లా తాజా వార్తలు
ధాన్యం, మొక్కజొన్న కొనుగోళ్లపై ఎప్పటికప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్.. అధికారులతో సమీక్షిస్తున్నారని వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో మొక్కజొన్నల దిగుమతి కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు.
పంట కొనుగోళ్లలో జాప్యం వద్దు: ఈటల
రైతులు తీసుకొచ్చిన పంటను వెంటనే కొనుగోలు చేయాలని అధికారులకు మంత్రి సూచించారు. ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేసి రైతులకు మేలు జరిగేలా చూడాలని తెలిపారు.
ఇవీ చూడండి:ప్రధానికి ముఖ్యమంత్రి ఏం చెప్పబోతున్నారు..?