తెలంగాణ

telangana

ETV Bharat / state

'ఎంఐఎం పాగా వేయాలని చూస్తోంది.. జాగ్రత్త'

ఈనెల 11న తన జన్మదినాన్ని పురస్కరించుకొని కార్యకర్తలు కేకులు, సన్మానాలు వంటి కార్యక్రమాలు చేయవద్దని కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ సూచించారు. అందుకు బదులుగా కార్యకర్తలు సభ్వత్వ నమోదు ఎక్కువగా చేయించాలని కోరారు.

By

Published : Jul 7, 2019, 5:24 PM IST

ఎంఐఎం పాగా వేయాలని చూస్తోంది.. జాగ్రత్త

మత విద్వేషాలు రెచ్చగొట్టే ఎంఐఎం పార్టీ కరీంనగర్​ కార్పొరేషన్​లో పాగా వేయాలని చూస్తోందని.. ఆ ప్రయత్నాల్ని తిప్పికొట్టాలని ప్రజలకు సూచించారు ఎంపీ బండి సంజయ్​ కుమార్. జిల్లా కేంద్రంలో భాజపా సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని మాజీ ఎంపీ జితేందర్ రెడ్డితో కలిసి ఆయన ప్రారంభించారు. కరీంనగర్ నగర పాలక సంస్థ పరిధిలో రెండు లక్షల సభ్యత్వ నమోదు చేపట్టాలని కార్యకర్తలకు సూచించారు. పులువురు తెదేపా, వైకాపా నాయకులను భాజపా కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈనెల 11న తన జన్మదినాన్ని పురస్కరించుకొని కార్యకర్తలు కేకులు సన్మానాలు, సత్కారాలు వంటివి చేయవద్దన్నారు.

ఎంఐఎం పాగా వేయాలని చూస్తోంది.. జాగ్రత్త

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details