కరీంనగర్ జిల్లా చొప్పదండి నియోజకవర్గంలో వేలాది ఎకరాల వరి పంట సాగు నీరు లేక ఎండిపోతుంటే.. కోనసీమ ఎలా అవుతుందని ప్రభుత్వాన్ని టీపీసీసీ అధికార ప్రతినిధి మేడిపల్లి సత్యం ప్రశ్నించారు. చొప్పదండి మండలం కాట్నపల్లి, మల్లన్నపల్లి, సాంబయ్యపల్లి గ్రామాల్లో ఎండిన పొలాలను సందర్శించిన ఆయన మీడియాతో మాట్లాడారు. స్థానిక ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ఈ అంశంపై స్పందించడం లేదని ఆరోపించారు.
చిన్నచూపు తగదు..
గాయత్రి పంప్ హౌస్ నుంచి గోదావరి జలాలను కొండపోచమ్మ సాగర్, మల్లన్న సాగర్, హల్దీ ప్రాజెక్టులకు తరలించుకుపోతున్నారని సత్యం మండిపడ్డారు. నియోజకవర్గంలో పొలాలను ఎండ బెడుతున్నారని విమర్శించారు. కేవలం రూ. పది కోట్ల ఖర్చుతో పంప్ హౌస్ నుంచి నేరుగా 5 వేల ఎకరాలకు సాగునీరు అందించే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. రైతుల సాగు నీటి కష్టాలపై ప్రభుత్వం స్పందించని పక్షంలో పంప్ హౌస్ వద్ద ఆందోళన చేపడతామని హెచ్చరించారు.
ఇదీ చదవండి:తెరాసకే ఓటు వేయాలని ఓటర్లతో ప్రమాణం... కాంగ్రెస్ అభ్యంతరం