కరీంనగర్ నగరాన్ని సుందరమైన నగరంగా తీర్చిదిద్దుతామని నగరపాలక సంస్థ మేయర్ సునీల్‌రావు పేర్కొన్నారు. నగరంలోని 47వ డివిజన్లో 56 లక్షలతో చేపట్టబోయే మురికి కాలువలు, సీసీ రహదారులు నిర్మాణానికి ఆయన కార్పొరేటర్‌తో కలిసి భూమి పూజ చేశారు.
'సుందర నగరంగా కరీంనగర్‌ని తీర్చిదిద్దాతాం' - తెలంగాణ తాజా వార్తలు
కరీంనగర్ నగరంలోని 47వ డివిజన్లో 56 లక్షలతో చేపట్టబోయే మురికి కాలువలు, సీసీ రహదారుల నిర్మాణానికి నగర మేయర్ సునీల్‌రావు... కార్పొరేటర్‌తో కలిసి భూమి పూజ చేశారు. సుందర నగరంగా కరీంనగర్‌ని తీర్చిదిద్దాతామన్నారు.
karimnagar mayor sunil rao
కరీంనగర్ నగరం ఏర్పడి మొదటి ఇంటి నంబర్ వీధిలో పనులు చేపట్టడం సంతోషంగా ఉందని వెల్లడించారు. 50 సంవత్సరాల క్రితం వేసిన రహదారులు, మురికి కాలువలు శిథిలావస్థకు చేరుకున్నాయని... ప్రజలు ఇబ్బందులు పడకుండా నగరపాలక సంస్థ చూస్తుందని చెప్పారు. నగరంలో కొవిడ్ ఉద్ధృతి దృష్ట్యా.. ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు తెలిపారు. అందరూ కొవిడ్ నిబంధనలు పాటించాలని కోరారు. లాక్డౌన్ సమయంలో ప్రజలు బయటకు రావొద్దని సూచించారు.
ఇవీ చూడండి:పన్ను చెల్లింపుదారులకు ఐటీ శాఖ కొత్త పోర్టల్