కరీంనగర్లోని 33వ డివిజన్ అయ్యప్ప స్వామి దేవాలయం వద్ద స్వాముల మహా పాదయాత్రను మేయర్ సునీల్ రావు ప్రారంభించారు. అయ్యప్ప స్వామి ఆలయంలో స్వాములతో కలిసి ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం శబరిమలకు పాదయాత్ర చేస్తున్న స్వాములు యాత్రను ప్రారంభించారు. స్వాములతో కలిసి ఆయన కొంత దూరం నడిచి... వారిని పంపించారు.
అయ్యప్ప స్వాముల పాదయాత్రను ప్రారంభించిన మేయర్ - కరీంనగర్ లేటెస్ట్ అప్డేట్స్
కరీంనగర్లో అయ్యప్ప స్వాముల మహా పాదయాత్రను మేయర్ సునీల్ రావు ప్రారంభించారు. అయ్యప్ప స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన అనంతరం దీక్షలు తీసుకున్న స్వాములు పాదయాత్రను ప్రారంభించారు. యాత్రను విజయవంతంగా పూర్తి చేసి క్షేమంగా తిరిగిరావాలని ఆకాంక్షించారు.
అయ్యప్ప స్వాముల పాదయాత్రను ప్రారంభించిన మేయర్
అయ్యప్ప దీక్షలు తీసుకున్న స్వాములు మహా పాదయాత్రను విజయవంతంగా పూర్తి చేయాలని మేయర్ సునీల్ రావు కోరారు. కరీంనగర్ నుంచి శబరిమల వరకు పాదయాత్ర చేస్తున్న స్వాములు తమ మొక్కులు చెల్లించుకొని... క్షేమంగా తిరిగిరావాలని ఆకాంక్షించారు. స్వాములందరికి అయ్యప్ప స్వామి ఆశీస్సులు ఎప్పటికీ ఉండాలని మేయర్ కోరారు.