కరీంనగర్ పట్టణాన్ని సుందర నగరంగా అభివృద్ధి చేస్తామని నగరపాలక సంస్థ మేయర్ సునీల్ రావు పేర్కొన్నారు. కరీంనగర్ నగరపాలక సంస్థ పరిధిలో ఇప్పటికే చాలా అభివృద్ధి పనులు చేపట్టినట్లు తెలిపారు. మిగిలిపోయిన సిసి రహదారుల నిర్మాణం పూర్తి చేస్తున్నామని వివరించారు.
కరీంనగర్‌ను సుందరీకరిస్తాం: మేయర్ సునీల్ రావు - కరీంనగర్ లో సిసి రోడ్లు నిర్మాణం పనులు
కరీంనగర్ పట్టణాన్ని సుందరంగా అభివృద్ధి చేస్తామని నగరపాలక సంస్థ మేయర్ సునీల్ రావు పేర్కొన్నారు. నగరపాలక సంస్థ పరిధిలో మిగిలిపోయిన నిర్మాణ పనులు పూర్తి చేస్తున్నట్లు వివరించారు. పనుల పూర్తి చేసే క్రమంలో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూడాలని గుత్తేదారులకు సూచించారు.

కరీంనగర్ ను సుందరీకరిస్తాం -మేయర్ సునీల్ రావు
నగరంలోని ఎస్.ఆర్.ఆర్ డిగ్రీ కళాశాల పక్కన రహదారి గుంతల మయం కావడంతో…తిరిగి నిర్మించడానికి రూ.16 లక్షలతో టెండర్లకు ఇచ్చినట్లు తెలిపారు. 15 రోజుల్లో నిర్మాణం పూర్తి చేసి ప్రజలకు ఇబ్బంది కాకుండా చూస్తామని మేయర్ అన్నారు. నాణ్యతతో పనులు చేపట్టాలని అధికారులను, కాంట్రాక్టర్లను ఆదేశించారు.
ఇవీ చదవండి: ధాన్యం కొనుగోలు చేయాలని కాంగ్రెస్ ఆందోళన