కరీంనగర్ నగరపాలక సంస్థ పరిధిలోని డివిజన్లలో అభివృద్ధి పనులు ముమ్మరంగా చేపట్టి ప్రజలకు అన్ని రకాల వసతులు కల్పిస్తామని... మేయర్ సునీల్ రావు అన్నారు. ఇప్పటికే పలు డివిజన్లలో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి పూర్తి దశకు చేరుకున్నాయని తెలిపారు.
త్వరలోనే సమస్యలు లేని నగరంగా మారుస్తా: మేయర్ - Karimnagar district latest news
కరీంనగర్లోని అన్ని డివిజన్లలో త్వరలోనే సమస్యలు లేకుండా చేస్తామని... నగరపాలక సంస్థ మేయర్ సునీల్ రావు తెలిపారు. అభివృద్ధి పనులు ముమ్మరంగా చేపట్టి ప్రజలకు అన్ని రకాల వసతులు కల్పిస్తామని అన్నారు. నగరంలోని 11వ డివిజన్లో రూ.26 లక్షల నిధులతో సీసీ రోడ్డు, డ్రైనేజ్ నిర్మాణ పనులకు భూమి పూజ చేశారు.
త్వరలోనే సమస్యలు లేని నగరంగా మారుస్తా: మేయర్
నగరంలోని 11వ డివిజన్లో రూ.26 లక్షల నిధులతో సీసీ రోడ్డు, డ్రైనేజ్ నిర్మాణ పనులకు కార్పొరేటర్ ఆకుల నర్మద నర్సన్నతో కలిసి భూమి పూజ చేశారు. అన్ని డివిజన్లలో త్వరలోనే సమస్యలు లేకుండా చేస్తామని మేయర్ స్పష్టం చేశారు. అభివృద్ధి పనులకు ప్రజలు సహకరించాలని ఆయన కోరారు.
ఇదీ చదవండి: తెలంగాణ ప్రాంత ఉద్యోగులను రిలీవ్ చేయాలని ఏపీకి లేఖ