కరీంనగర్ నగర పాలక సంస్థ స్మార్ట్ సిటీగా ఎంపికైందని, అయితే ఇంకొన్ని అభివృద్ధి పనులు పెండింగ్‌లో ఉన్నాయని వాటిని త్వరలోనే పూర్తి చేస్తామని మేయర్ వై.సునీల్ రావు అన్నారు. నగరంలోని 40వ డివిజన్లో ప్రధాన కూడలి వద్ద కార్పొరేటర్ భూమ గౌడ్ ఏర్పాటు చేసిన వీధి దీపాలను ఆయన కాలనీ వాసులతో కలిసి ప్రారంభించారు. నగరపాలక సంస్థ పరిధిలో నగరంలో అన్ని కూడళ్ల వద్ద వీధి దీపాలు ఏర్పాటు చేస్తామని ఆయన పేర్కొన్నారు.
'కరీంనగర్‌ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం' - కరీంనగర్లో పలు అభివృద్ధి కార్యక్రమాలు
కరీంనగర్లో అన్ని అభివృద్ధి పనులను త్వరలోనే పూర్తి చేసి స్మార్ట్‌సిటీని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతామని మేయర్ సునీల్‌రావు పేర్కొన్నారు. 40వార్డు కార్పొరేటర్ ఏర్పాటు చేసిన ప్రధాన కూడళ్లలోని వీధి దీపాలను ఆయన ప్రారంభించారు.
'కరీంనగర్ స్మార్ట్‌సిటీని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం'
సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. మాస్కులు ధరించాలని సూచించారు. నగరంలోని అంతర్గత రహదారులు మరమ్మతులు చేస్తున్నామని అవసరమున్న చోట నూతన రహదారులను నిర్మాణాలను చేపడుతున్నామని తెలిపారు. ప్రజలు తమ ఇళ్ల ముందు నాటిన మొక్కలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని ఆయన కోరారు.
ఇదీ చూడండి:'తీవ్రవాదం ఏ రూపంలో ఉన్నా భారత్ సహించదు'