లాక్డౌన్ సమయంలోనూ పారిశుద్ధ్య పనులు చేపడుతున్న కార్మికులకు కరీంనగర్ మేయర్ సునీల్‌రావు నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. కరోనా విజృంభణ సమయంలో వైరస్ సంక్రమించకుండా ఉండేందుకు కీలకపాత్ర పోషిస్తున్నారని ఆయన పేర్కొన్నారు.
కార్మికులకు మేయర్ సునీల్‌రావు నిత్యావసరాల పంపిణీ - కరీంనగర్ జిల్లా తాజా వార్తలు
కరీంనగర్లో పారిశుద్ధ్య కార్మికులకు మేయర్ సునీల్‌రావు నిత్యావసరాల పంపిణీ చేశారు. వాణీ విద్యానికేతన్ ఆధ్వర్యంలో నిత్యావసర వస్తువులు పంపిణీని పూనుకోవడం ఎంతో సంతోషదాయకమని మేయర్ పేర్కొన్నారు.
mayor sunil rao
కరోనా తొలి విడతలోనూ వాణీ విద్యానికేతన్ ఇలాంటి సేవలే అందించారని... ఇప్పుడు మరోసారి నిత్యావసర వస్తువులు పంపిణీని పూనుకోవడం ఎంతో సంతోషదాయకమని మేయర్ పేర్కొన్నారు. దాదాపు 300మందికి పైగా పారిశుధ్య కార్మికులు పనిచేస్తున్నారని అన్నారు. వారి సేవలను గుర్తించి ఇలా సహాయ సహకారాలు అందిస్తే కార్మికులు మరింత మనస్ఫూర్తిగా విధులు నిర్వర్తిస్తారని మేయర్ సునీల్‌రావు వివరించారు.