తెలంగాణ

telangana

ETV Bharat / state

కరీంనగర్ పట్టణ వ్యాప్తంగా వ్యాయామశాలల ఏర్పాటు - కరీంనగర్ లేటెస్ట్ న్యూస్

కరీంనగర్ వ్యాప్తంగా వ్యాయామశాలలను ఏర్పాటు చేస్తున్నట్లు మేయర్ సునీల్ రావు వెల్లడించారు. ఎస్​ఆర్​ఆర్ ప్రభుత్వ కళాశాలలో పాదచారులతో కలిసి ఆయన పర్యటించారు. ఓపెన్ జిమ్​లను సొంతవాటిగా పరిరక్షించుకోవాలని కోరారు.

Breaking News

By

Published : Dec 17, 2020, 1:01 PM IST

కరీంనగర్ నగరపాలక సంస్థ పరిధిలో ఉన్న మైదానాల్లో వ్యాయామశాలలతోపాటు వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేస్తున్నామని మేయర్ సునీల్ రావు తెలిపారు. ఎస్​ఆర్​ఆర్​ ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో పాదచారులతో కలిసి పర్యటించారు. నగరంలోని మైదానాల్లో రూ.1కోటి కేటాయించి ఓపెన్ జిమ్​లు, వాకింగ్ ట్రాక్​లు, సైక్లింగ్ ట్రాక్​లను ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు.

కళాశాల మైదానంలో పాదచారులకు ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాట్లను పూర్తి చేస్తామని... ప్రజలు ఓపెన్ జిమ్​లను పరిరక్షించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్​ఆర్​ఆర్ కళాశాల పాదచారుల అసోసియేషన్ అధ్యక్షుడు చక్రధరరావు తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి:బ్యాంకు కొల్లగొట్టేందుకు విఫలయత్నం.. సీసీలో దృశ్యాలు

ABOUT THE AUTHOR

...view details