కరీంనగర్ జిల్లా చొప్పదండి నియోజకవర్గంలోని పలు మండలాల్లో మేడే దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. చొప్పదండి, గంగాధర, రామడుగు, బోయినపల్లి, కొడిమ్యాల, మల్యాల తదితర మండలాల్లో సీపీఐ ఆధ్వర్యంలో జెండా ఎగురవేశారు. వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల కూడళ్లలో సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి కొయ్యడ సృజన్ కుమార్ ఎర్రజెండా ఎగరవేసి నినాదాలు చేశారు.
చొప్పదండి నియోజకవర్గంలో ఘనంగా మేడే వేడుకలు - కరీంనగర్లో మేడే వేడుకలు
కరీంనగర్ జిల్లాలోని పలు మండలాల్లో మేడే దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. సీపీఐ ఆధ్వర్యంలో జెండా ఎగురవేసి సంబురాలు జరుపుకున్నారు.
కరీంనగర్లో మేడే సంబురాలు
చికాగోలోని హే మార్కెట్లో శ్రమ జీవుల అసామాన్య పోరాట ఫలితమే మే డే దినోత్సవమని కొనియాడారు. కార్మికుల పని గంటలు తగ్గించి వారి శ్రేయస్సుకు మే డే ప్రతీకగా నిలుస్తుందని కొనియాడారు.
ఇదీ చదవండి:ఈటల వ్యవహారం సీఎం పరిధిలో ఉంది: తలసాని