తెలంగాణ

telangana

ETV Bharat / state

సడలింపు ఇచ్చిరంట... సన్నాయి మోగెనంట! - marriages in karimnagar

పెండ్లి సమయానికి ఆపండి అంటూ సినిమాల్లో వినిపించే డైలగ్​లా... కనిపించని రక్కసి వధూవరుల పాలిట విలన్​గా మారింది. ఇన్ని రోజుల పాటు వివాహలు వాయిదా వేసుకునేలా చేసింది. ఎట్టకేలకు ప్రభుత్వం ఇచ్చిన సడలింపుతో... నిలిచిపోయిన పెండ్లిలు నిబంధనలు పాటిస్తూనే మళ్లీ పీటలెక్కుతున్నాయి.

marriages are conducting in karimnagar following lock down rules
సడలింపు ఇచ్చిరంట... సన్నాయి మోగెనంటా...!

By

Published : May 8, 2020, 11:17 AM IST

Updated : May 8, 2020, 12:57 PM IST

కరోనా వైరస్ నివారణలో భాగంగా విధించిన లాక్​డౌన్​ వల్ల తెలుగు రాష్ట్రాల్లో జరగాల్సిన వివాహాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ప్రభుత్వం ఇచ్చిన సడలింపుల వల్ల నిలిచిపోయిన పెళ్లిల్లు ప్రస్తుత నిబంధనల మేరకు పెద్దలు జరిపిస్తున్నారు.

కరీంనగర్ రూరల్ మండలం చామనపల్లికి చెందిన కీర్తన, అజయ్​ల పెండ్లిని పెద్ద హడావుడి లేకుండానే జరిపించారు. రుద్రంగిలో మధుసూదన్, సారిక వివాహాన్ని నింబధనలకు అనుగుణంగా నిరాడంబరంగా నిర్వహించారు. ఇరువురి పెళ్లిళ్లకు 20 మంది బంధువులు వచ్చి నూతన వధూవరులను ఆశీర్వదించారు.

సడలింపు ఇచ్చిరంట... సన్నాయి మోగెనంటా...!
సడలింపు ఇచ్చిరంట... సన్నాయి మోగెనంటా...!

ఇదీ చూడండి:భోపాల్​ నుంచి విశాఖ వరకు.. చీకటి నింపిన గ్యాస్​ లీక్​లెన్నో...

Last Updated : May 8, 2020, 12:57 PM IST

ABOUT THE AUTHOR

...view details