కరీంనగర్‌కు చెందిన శ్రీకాంత్‌కు మంథనికి చెందిన తేజస్వినికి గత రెండు నెలల క్రితం వివాహ నిశ్చయం జరిగింది. సర్కారు లాక్డౌన్ సడలింపులు ఇచ్చిన నేపథ్యంలో ఈరోజు మంథనిలోని వధువు ఇంటి పరిసరాల్లోనే తక్కువ మంది బంధు వర్గంతో స్వీయ రక్షణ చర్యలు పాటిస్తూ, మాస్కులు ధరించి, శానిటైజర్లను ఏర్పాటు చేసుకొని సామాన్యంగా వివాహం జరిపించారు.
స్వీయ రక్షణ చర్యలు పాటిస్తూ...కల్యాణం కానిచ్చేశారు - karimnagar district latest news
దేశం వ్యాప్తంగా లాక్డౌన్ నేపథ్యంలో అనేక శుభకార్యాలు వాయిదా పడ్డాయి. ఇటీవల సర్కారు లాక్డౌన్ సడలింపులు ఇవ్వడం వల్ల అక్కడక్కడ ప్రభుత్వ అధికారుల అనుమతితో వివాహాలు జరుగుతున్నాయి. ఓ జంట ఈరోజు మంథనిలో స్వీయ రక్షణ చర్యలు పాటిస్తూ... వివాహం చేసుకొని అందరికీ ఆదర్శంగా నిలిచారు.

karmingar District latest news
వివాహానికి వచ్చిన చిన్న పిల్లలు సైతం మాస్కులు ధరించి అందరికీ స్వీయ రక్షణ ఎంత అవసరమో తెలియాజేశారు. వివాహానికి విచ్చేసిన ఆ కొద్ది మంది మళ్లీ పాత రోజులు వచ్చాయని... ఒకరికొకరు గుర్తు చేసుకుంటూ ఆ కాలంలో జరిగిన వారి పెళ్లిళ్ల గురించి ముచ్చటించుకున్నారు.