తెలంగాణ

telangana

ETV Bharat / state

'ఊరేగింపు ఆపండి... మీ భార్య నేను ప్రేమించుకున్నాం' - ప్రేమించిన యువతి పెళ్లిని ఆపిన ప్రేమికుడి వార్తలు

తను ప్రేమించిన అమ్మాయికి మరో యువకుడితో వివాహం జరిగడాన్ని ఆ యువకుడు జీర్ణించుకోలేకపోయాడు. ఎలా అయినా తన ప్రేయసిని దక్కించుకోవాలని చూశాడు. ప్రేయసిని దక్కించుకోవడానికి అతను స్నేహితులతో కలిసి ఏం చేశాడో తెలియాలంటే ఇది చదవాల్సిందే.

marriage-cancelled-by-her-lover-in-huzurabad-at-karimnagar-district
'ఊరేగింపు ఆపండి... మీ భార్య నేను ప్రేమించుకున్నాం'

By

Published : Aug 26, 2020, 11:44 PM IST

Updated : Aug 27, 2020, 4:00 AM IST

'ఊరేగింపు ఆపండి... మీ భార్య నేను ప్రేమించుకున్నాం'

కరీంనగర్‌ జిల్లా హుజూరాబాద్‌ మామిండ్లవాడకు చెందిన ఓ యువతికి... మంచిర్యాల జిల్లా రామకృష్ణాపూర్​కు చెందిన ఓ యువకుడితో ఈనెల 24న వివాహం జరిగింది. యువతి ఇంటి వద్దే వివాహ వేడుకలను నిర్వహించారు. పెళ్లి అనంతరం వధూవరులను ఊరేగింపు నిర్వహిస్తుండగా జరిగిన ఓ ఘటన వరుడుని, అతని బంధువలను విస్మయానికి గురిచేసింది.

పెళ్లి చేసుకుని ఆనందంలో ఉన్న వరుడు... వధువును ఊరేగింపుగా ఇంటికి తీసుకెళ్తుండగా ఓ యువకుడు అతని స్నేహితులతో కలిసి అడ్డుగా వచ్చాడు. మీ భార్యను నేను ప్రేమించానంటూ యువతిని తీసుకెళ్లేందుకు యత్నించాడు. ఈ షాక్ నుంచి తేరుకున్న వరుడు, అతని బంధువులు ప్రియుడిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు.

అతనితోనే ఉంటా..

పోలీసు స్టేషన్​కు తీసుకెళ్లి అతనిని విచారించగా తామిద్దరూ ప్రేమించుకున్నట్లు వెల్లడించారు. ఈ విషయమై యువతిని ప్రశ్నించగా... మేమిద్దరం ప్రేమించుకున్నాం. పెళ్లి చేసుకుందామనుకున్నామని తెలిపింది. ఇప్పుడు భర్తతో వెళ్తావా? ప్రియుడితో వెళ్తావా అని అడుగగా ఆమె ప్రేమించిన వ్యక్తితోనే జీవితాన్ని పంచుకుంటానని తెలిపింది. దీంతో వధువు, వరుడి తరపు వాళ్లు... వధువుని పోలీస్ స్టేషన్​లోనే వదిలి వెళ్లిపోయారు.

ఈ మొత్తం ఘటనలో ఎవరికైనా అన్యాయం జరిగిదంటే అది వరుడికి మాత్రమే. పెళ్లికి ముందే నిజం చెప్పకపోవడం అమ్మాయి తప్పు కాగా... అమ్మాయి ప్రేమను అర్థం చేసుకోకుండా మరొకరికిచ్చి పెళ్లి చేసిన ఆమె తల్లిదండ్రులు చేశారు. ఎన్నో కలలతో పెళ్లి చేసుకున్న అతను.. చివరికి ఒంటరిగా మిగిపోవాల్సివచ్చింది.

ఇదీ చూడండి:'మాకు సీఐడీ మీద నమ్మకం లేదు... సీబీఐ విచారణ కావాలి'

Last Updated : Aug 27, 2020, 4:00 AM IST

ABOUT THE AUTHOR

...view details