కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం మన్నెంపల్లి వద్ద వరదకాల్వకు గండి పడింది. కాల్వ నుంచి పెద్ద ఎత్తున వరద నీరు మన్నెంపల్లిలోకి వచ్చి చేరుతుంది. ఫలితంగా గ్రామస్థులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.
మునిగిన మన్నెంపల్లి... వరద కాల్వకు గండి - మన్నెపల్లిలో వరద కాల్వకు గండి
అధికారుల నిర్లక్ష్యం మన్నెంపల్లి గ్రామాన్ని మళ్లీ ముంచింది. వరదకాల్వకు మూడురోజుల క్రితం గండి పడగా... అధికారులు తాత్కాలిక మరమ్మతులు చేసి వదిలేశారు. మళ్లీ నేడు ఉదయం కాల్వకు గతంలో పడిన చోటే గండి పడి.. మన్నెంపల్లిని ముంచేసింది.
మునిగిన మన్నెంపల్లి... వరద కాల్వకు గండి
మూడ్రోజుల క్రితం వరదకాల్వకు గండిపడి ఇళ్లలోకి నీరు చేరగా... అధికారులు తాత్కాలిక మరమ్మతులు చేసి పూడ్చారు. కాగా నేడు గతంలో పడిన చోటే మరోసారి వరదకాల్వకు గండి పడింది. గ్రామస్థులంతా గండిని పూడ్చేందుకు మరమ్మతు చర్యలు చేపట్టారు. పొక్లెయినర్ సాయంతో నీటిని చెరువులకు మళ్లిస్తున్నారు. నాణ్యతాలోపంతోనే ఇలాంటి పరిస్థితి ఏర్పడిందని రైతులు ఆరోపిస్తున్నారు.
ఇవీచూడండి:రహదారిపై రారాజుల సంచరిస్తూ.. భయం పుట్టిస్తున్న పెద్దపులి