తెలంగాణ

telangana

ETV Bharat / state

Manickam Tagore: 'భాజపా, తెరాసలు ప్రజలను మోసం చేస్తున్నాయి' - karimnagar district latest news

రాష్ట్రంలో పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అవినీతికి పాల్పడుతున్నారని కాంగ్రెస్​ రాష్ట్ర వ్యవహారాల బాధ్యుడు మాణిక్కం ఠాగూర్ ఆరోపించారు. భాజపా, తెరాసలు అంతర్గతంగా కుమ్మక్కై ప్రజలను మోసం చేస్తున్నాయని విమర్శించారు. రాబోయే ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

MANICKAM TAGORE: 'భాజపా, తెరాసలు ప్రజలను మోసం చేస్తున్నాయి'
MANICKAM TAGORE: 'భాజపా, తెరాసలు ప్రజలను మోసం చేస్తున్నాయి'

By

Published : Aug 29, 2021, 8:56 PM IST

తెలంగాణలో రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల బాధ్యుడు మాణిక్కం ఠాగూర్ ధీమా వ్యక్తం చేశారు. తెరాస, భాజపాలు దిల్లీలో దోస్తీ.. గల్లీలో కుస్తీ చేస్తూ ప్రజలను మోసం చేస్తున్నాయని ఆరోపించారు. కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు.

ఈ సందర్భంగా రాష్ట్రంలో పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అవినీతికి పాల్పడుతున్నారని మాణిక్కం ఠాగూర్​ విమర్శించారు. మంత్రి గంగుల కమలాకర్ అక్రమంగా తవ్వకాలు జరుపుతూ.. ప్రకృతి వనరులను దోచుకుంటున్నారని ఆరోపించారు. కోట్లాది రూపాయలు దండుకుంటూ.. పన్నులు ఎగ్గొడుతున్నా ఈడీ చర్యలు తీసుకోకపోవడంలో అంతర్యమేంటని ప్రశ్నించారు.

భాజపా, తెరాసలు దిల్లీలో దోస్తీ.. గల్లీలో కుస్తీ..

రాష్ట్రంలో భాజపా, తెరాసలు అంతర్గతంగా కుమ్మక్కై ప్రజలను మోసం చేస్తున్నాయని ఠాగూర్​ ఆరోపించారు. కరీంనగర్ ఎంపీ బండి సంజయ్​కు చిత్తశుద్ధి ఉంటే గ్రానైట్ స్కాంపై లిఖితపూర్వకంగా అమిత్​షాకు ఫిర్యాదు చేయాలని అన్నారు. ఈ సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని ప్రభుత్వాలు చేస్తున్న అక్రమాలపై కేంద్ర ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ధ్వజమెత్తారు. బండి సంజయ్​ మాటలన్నీ ఆరోపణలకే పరిమితమన్న మాణిక్కం.. బండి పాదయాత్రతో ఎలాంటి లాభం లేదన్నారు.

తెలంగాణ ఇచ్చింది సోనియానే..

తెలంగాణ అమరవీరుల త్యాగాలను గుర్తించి.. ప్రత్యేక రాష్ట్రం ఇచ్చింది సోనియా గాంధీ అని మాణిక్కం ఠాగూర్​ గుర్తు చేశారు. రాబోయే ఎన్నికల్లో పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి ప్రతి కార్యకర్త ముందుండి పోరాడాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ప్రజలకు చేరువయ్యేందుకు సోషల్​ మీడియాను వేదికగా చేసుకోవాలని సూచించారు. ప్రజా సమస్యలను తెలుసుకుని.. సమస్య పరిష్కారానికి కృషి చేయాలని కోరారు.

రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్​ అధికారంలోకి వస్తుంది. 78 సీట్లు గెలిచేలా ప్రతి ఒక్క కార్యకర్త కృషి చేయాలి. తెలంగాణలో తెరాస నేతలు అవినీతికి పాల్పడుతున్నారు. గంగుల కమలాకర్​ గ్రానైట్​ దందా చేస్తూ.. కోట్లు దండుకుంటున్నాడు. ఈ అక్రమాలపై కరీంనగర్​ ఎంపీ బండి సంజయ్​ కేంద్రానికి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేయాలి. తెలంగాణ అమరవీరుల త్యాగాలను గుర్తించి ప్రత్యేక రాష్ట్రం ఇచ్చింది సోనియా గాంధీ. రాబోయే ఎన్నికల్లో పార్టీని అధికారంలోకి తెస్తాం:- మాణిక్కం ఠాగూర్​, కాంగ్రెస్​ రాష్ట్ర వ్యవహారాల బాధ్యుడు.

ABOUT THE AUTHOR

...view details