తెలంగాణ

telangana

ETV Bharat / state

కేసీఆర్​ ఒంటరి అయ్యారు: మందకృష్ణ - మందకృష్ణ మాదిగ మద్దతు

కరీంనగర్​లో మహిళా కండక్టర్లు చేస్తున్న దీక్షకు మందకృష్ణ మాదిగ మద్దతు తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్​ వ్యవహరిస్తున్న తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

కేసీఆర్​ ఒంటరి అయ్యారు: మందకృష్ణ

By

Published : Oct 24, 2019, 11:55 PM IST


నియంతలే భయపడతారు.. పోరాటం చేసే వారు గమ్యాన్ని ముద్దాడే వరకు శ్రమిస్తారని ఎమ్మార్పీఎస్​ రాష్ట్ర అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ అన్నారు. ఆర్టీసీ కార్మికుల సమ్మెలో భాగంగా కరీంనగర్​లో దీక్ష చేస్తున్న మహిళా కండక్టర్లకు ఆయన సంఘీభావం ప్రకటించారు. ఆర్టీసీ కార్మికుల పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యవహరిస్తున్న తీరుపట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్టీసీ సమ్మె ప్రారంభం నాటికి.. ఇప్పటికి ఎంతో తేడా ఉందన్నారు. ఈ నెల 5న సమ్మె మొదలైనప్పుడు కేవలం ఆర్టీసీ కార్మికులు, సీఎం మధ్య వివాదంగా కనిపించిందని.. ప్రస్తుతం పరిస్థితి అలా లేదని పేర్కొన్నారు. ప్రజలు, పార్టీలు కార్మికుల పక్షాన నిలబడితే.. కేసీఆర్‌ ఒంటరి అయ్యారని ఎద్దేవా చేశారు. తమ న్యాయమైన డిమాండ్లపై పోరాటం చేయాలే తప్ప ఆత్మస్థైర్యాన్ని కోల్పోవద్దని కార్మికులకు మందకృష్ణ మాదిగ సూచించారు.

కేసీఆర్​ ఒంటరి అయ్యారు: మందకృష్ణ

ABOUT THE AUTHOR

...view details