రైతును రాజు చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం విననూత్న కార్యక్రమాలకు శ్రీకారం చుడుతోందని దీనికి అందరూ సహకరించాలని ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ అన్నారు. కరీంనగర్ జిల్లా గన్నేరువరంలో ఓ రైతు పొలంలో స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి సన్నరకం వడ్లను అలుకుడు చేశారు. వ్యవసాయ అధికారుల సూచనలు పాటిస్తూ సన్నరకానికి రైతులు ప్రాధాన్యత ఇచ్చి అధిక లాభాలు పొందాలని సూచించారు.
రైతుగా మారిన ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ - మొలక చల్లిన మానకొండూరు ఎమ్మెల్యే
మానకొండూరు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ కాసేపు రైతుగా మారారు. కరీంనగర్ జిల్లా గన్నేరువరంలో ఓ రైతు పొలంలోకి దిగి మొలక చల్లారు. రైతులు నియంత్రిత విధానంలో సాగు చేసి... అధిక లాభాలు పొందాలని సూచించారు.
మొలక చల్లిన మానకొండూరు ఎమ్మెల్యే
మొక్కజొన్న సాగును తగ్గించి. పత్తి, కందులు పండించాలని రైతులను ఎమ్మెల్యే కోరారు. కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణకు గుండెకాయలా పని చేస్తున్న క్రమంలో బీడు భూములన్నీ సస్యశ్యామలం అవుతున్నాయని హర్షం వ్యక్తం చేశారు. రైతుబంధు, రైతుబీమాతోపాటు విభిన్న కార్యక్రమాలు రైతులకు అందుబాటులో ఉండే విధంగా సీఎం కేసీఆర్ ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారని స్పష్టం చేశారు.
ఇదీ చూడండి:తొలిసారి ల్యాప్‌టాప్‌లతో 'ఎంఐ'.. ధరలివే