తెలంగాణ

telangana

ETV Bharat / state

దళారుల నుంచి విముక్తికై.. కొనుగోలు కేంద్రాలు - manakondur mla rasamayi balakishan

దళారుల నుంచి విముక్తి పొందడానికి రైతుల కోసం తెలంగాణ ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసిందని మానకొండూరు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్​ అన్నారు.

కరీంనగర్​లో ఐకేపీ కొనుగోలు కేంద్రాలు ప్రారంభం

By

Published : Oct 31, 2019, 1:43 PM IST


కరీంనగర్​ జిల్లా గన్నేరువరం, జంగపల్లి, హన్మాజిపల్లి గ్రామాల్లో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ప్రారంభించారు. దళారుల నుంచి రైతులు విముక్తి పొందడానికి ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసిందని పేర్కొన్నారు. రైతులు ఈ సేవలను సద్వినియోగం చేసుకుంటూ అధిక దిగుబడులు పొందాలని సూచించారు. మద్దతు ధరకే ధాన్యాన్ని కొనుగోలు చేయాలని అధికారులను ఆదేశించారు. అనంతరం ఎంపీడీవో కార్యాలయంలో లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, సీఎం సహాయనిధి చెక్కులు పంపిణీ చేశారు.

కరీంనగర్​లో ఐకేపీ కొనుగోలు కేంద్రాలు ప్రారంభం

ABOUT THE AUTHOR

...view details