తెలంగాణ

telangana

ETV Bharat / state

'నిర్లక్ష్యం వహిస్తే.. ఉపేక్షించేదిలేదు' - మానకొండూర్​ ఎమ్మెల్యే

విధుల్లో నిర్లక్ష్యం వహించే అధికారులను ఉపేక్షించబోమని మానకొండూర్​ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

manakondur mla rasamayi balakishan fires on government officers as they are failed to attend a meeting
మానకొండూర్​ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్

By

Published : Dec 19, 2019, 9:07 AM IST

మానకొండూర్​ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్

కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండల పరిషత్ కార్యాలయంలో సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఎంపీపీ ఉమ్మెంతల సరోజన అధ్యక్షతన నిర్వహించిన ఈ సమావేశానికి ఎమ్మెల్యే రసమయి బాలకిషన్​ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

మూణ్నెళ్లకోసారి నిర్వహించే మండల సర్వసభ్య సమావేశానికి వివిధ శాఖల అధికారులు గైర్హాజరు కావడం పట్ల ఎమ్మెల్యే అసంతృప్తి వ్యక్తం చేశారు. బాధ్యతగా ఉండాల్సిన అధికారులు పట్టీ పట్టనట్లు వ్యవహరించడం సరికాదన్నారు.

అధికారుల తీరులో మార్పు రాకపోతే ఉన్నతాధికారులకు నివేదించాలని ఎంపీపీని ఆదేశించారు. నిబంధనలకు అనుగుణంగా పనిచేయాలని సూచించారు.

ABOUT THE AUTHOR

...view details