తెలంగాణ

telangana

ETV Bharat / state

12 గంటలు మధ్యమానేరు జలాశయంలోనే..! - man suicide attempt in mdedimareru reservoir

ఆత్మహత్య చేసుకోవడానికి మధ్యమానేరు జలాశయంలో దూకిన వ్యక్తి పిల్లరు సలాకను ఆసరాగా చేసుకొని సుమారు 12 గంటలు నీటిలో ఉండిపోయాడు. చివరకు అతని అరుపులు విన్న మత్స్యకారులు, స్థానికులు అతన్ని కాపాడిన సంఘటన శనివారం బోయినపల్లి మండలంలో చోటు చేసుకుంది.

man-suicide-attempt-in-medimaneru-reservoir-at-bowenpally-karimnagar
12 గంటలు మధ్యమానేరు జలాశయంలోనే

By

Published : May 3, 2020, 1:41 PM IST

కరీంనగర్‌ జిల్లా చింతకుంట పరిధిలోని శాంతినగర్‌కు చెందిన రవి (52) శుక్రవారం సాయంత్రం ద్విచక్ర వాహనంపై బోయినపల్లి మండలం కొదురుపాక సమీపంలో ఉన్న నాలుగు వరుసల వంతెనపైకి వెళ్లాడు. వాహనాన్ని వంతెనపై పక్కన పెట్టి జలాశయంలోకి దూకాడు. కొంత దూరం నీటిలో కొట్టుకుపోయిన అనంతరం వంతెన పిల్లరుకు ఉన్నటువంటి సలాకను పట్టుకున్నాడు. చీకటి సమయంలో జలాశయంలో మత్స్యకారులు లేకపోవడం వల్ల రవి అరుపులు ఎవరికీ వినబడలేదు.

శనివారం ఉదయం నడకకు వెళ్లిన స్థానికులు, మత్స్యకారులు రవి అరుపులు విన్నారు. తెప్పల సాయంతో రవిని మత్స్యకారులు ఒడ్డుకు చేర్చి కుటుంబ సభ్యులకు సమాచారం అందించడంతో వారు వచ్చి తీసుకెళ్లారు. అయితే ఆయన ఆత్మహత్యాయత్నానికి కారణాలు తెలియరాలేదు.

ఇదీ చూడండి:'కరోనా వ్యాప్తి నియంత్రణలో భారత్‌ భేష్‌'

ABOUT THE AUTHOR

...view details