కరీంనగర్ జిల్లా తీగలగుట్టపల్లిలో దారుణం చోటుచేసుకుంది. గ్రామంలోని హెయిర్ కటింగ్ సెలూన్‌కు ఆసిఫ్ అనే యువకుడు మాస్కు లేకుండా వచ్చాడు. సెలూన్లో పనిచేస్తున్న రాజశేఖర్... మాస్కు పెట్టుకోవాలని సూచించాడు. కోపోద్రిక్తుడైన ఆసిఫ్... మాస్కు పెట్టుకోకపోతే నీకేంటంటూ గొడవకి దిగాడు. వెంటనే కత్తి తీసుకొని రాజశేఖర్ నడుముపై దాడి చేశాడు.
తీవ్ర గాయాలపాలైన రాజశేఖర్‌ను సెలూన్ యజమాని ఆస్పత్రికి తరలించాడు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆసిఫ్‌ను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.