కరీంనగర్లో గుండెపోటుతో వ్యక్తి మృతి - Man Died of heart attack in Karimnagar buying vegetables
కరీంనగర్లో విషాదం చోటచేసుంది. లాక్డౌన్ సడలింపు సమయంలో కూరగాయలు కొనుగోలు చేసేందుకు సమీప మార్కెట్‌కు వెళ్లిన వ్యక్తి గుండె పోటుతో మృతిచెందాడు. ఇంటి యాజమాని మరణించటం వల్ల కుటుంబంలో విషాదఛాయలు నెలకొన్నాయి.
కరీంనగర్లో గుండెపోటుతో వ్యక్తి మృతి
కరీంనగర్ 38 డివిజన్ సంతోష్ నగర్‌కు చెందిన నాంపల్లి రాజయ్య కూరగాయల కొనుగోలు చేసేందుకు వచ్చి గుండెపోటుతో మృతి చెందాడు. రాజయ్య ఆటో నడుపుకుంటూ జీవనం కొనసాగిస్తున్నాడు. ఇంటి యాజమాని మరణించటం వల్ల కుటుంబంలో విషాదఛాయలు నెలకొన్నాయి. మార్కెట్లో విధులు నిర్వహిస్తున్న పోలీసులు, వాలంటీర్లు రాజయ్య మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు.