Man Attacked on Young Woman With Knife in Karimnagar : సమాజంలో రోజురోజుకు ఆడవారిపై అరాచకాలు పెరిగిపోతున్నాయి. మహిళలు కనిపిస్తే చాలు క్రూరమృగాలుగా మారి, వావి వరసలు మరిచి అత్యాచారాలకు తెగబడుతున్నవారు కొందరు. ప్రేమిస్తున్నామని వెంటపడి మోసం చేసేవారు మరికొందరు. ఆ ప్రేమను కాదంటే కాలయములుగా మారి ప్రాణాలు తీస్తున్నవారు ఇంకొందరు. తాజాగా తన ప్రేమను నిరాకరించిందని ఓ యువతిపై దాడి చేశాడు ఓ ప్రేమోన్మాది( Knife Attack in Karimnagar). ఈ ఘటన కరీంనగర్ జిల్లాలో చోటుచేసుకుంది.
Knife Attack in Karimnagar : కొత్తపల్లి మండలంలో గురువారం దారుణం జరిగింది. తనను ప్రేమించాలంటూ యువతిపై ఒత్తిడి తెచ్చి. ఆమె అంగీకరించకపోవడంతో ఓ యువకుడు కత్తితో దాడి చేశాడు. కొత్తపల్లికి చెందిన యువతి(26) ఎమ్మెస్సీ పూర్తి చేసి ఉద్యోగ ప్రయత్నాలు చేస్తోంది. ఆమె ఇంటి సమీపంలో ఉంటున్న బొద్దుల సాయి ప్రేమిస్తున్నానని వెంటపడటంతో ఆమె నిరాకరించింది. ఈ విషయమై పెద్దల సమక్షంలో పంచాయితీలు జరిగినా యువకుడిలో మార్పు రాలేదు.
అర్ధరాత్రి ఇంట్లో చొరబడి.. యువతి గొంతు కోసిన ప్రేమోన్మాది
A Lover Cuts young woman Neck in Hyderabad :ఈ క్రమంలో ఆమెను తనకిచ్చి పెళ్లి చేయాలని వారం కిందట నిందితుడు సాయి యువతి తండ్రి సెల్‌ఫోన్‌కు రెండుసార్లు మెసేజ్‌లు పంపించాడు. దీనికి ఆయన స్పందించకపోవడంతో కోపం పెంచుకున్నాడు. గురువారం సాయంత్రం ఆ యువతి ఇంట్లో ఎవరూ లేని సమయంలో సాయి వెళ్లి తనను పెళ్లి చేసుకోవాలంటూ ఆమెతో ఘర్షణకు దిగాడు. యువతి కాదనడంతో కత్తితో మెడపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు. అడ్డుకునే ప్రయత్నంలో ఆమె చేయి తెగిందని పోలీసులు తెలిపారు.