కరీంనగర్ సమీపంలోని ఇరుకుల్ల వద్ద టీఎస్ఆర్టీసీ రాజధాని బస్సు ప్రమాదానికి గురైంది. ఈ బస్సు ప్రయాణికులతో మంచిర్యాల నుంచి హైదరాబాద్ వెళ్తోంది. వెనక నుంచి మరో మూడు లారీలు బస్సును ఢీకొన్నాయి. ఇరుకుల్లలోని లలిత సీడ్స్ వద్ద ప్రమాదవశాత్తు లారీ టైర్ పగిలింది. డ్రైవర్ వెంటనే పక్కకు తీశాడు. ఒక్కసారిగా వేగం తగ్గిన క్రమంలో వెనుకనుండి వేగంగా వస్తున్న ఇంకో లారీ దాన్ని ఢీ కొట్టింది.
టీఎస్ఆర్టీసీ రాజధాని బస్సును ఢీ కొట్టిన లారీ - latest accident news karimnagar
టీఎస్ఆర్టీసీ రాజధాని బస్సును లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో ప్రయాణికులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. బాధితులను ఆసుపత్రికి తరలించారు. ---
టీఎస్ఆర్టీసీ రాజధాని బస్సును ఢీ కొట్టిన లారీ
ఆ లారీ వెనుకే ఉన్న రాజధాని బస్సు ఆ లారీని ఢీకొట్టింది. బస్సు వెనకాలే వేగంగా వస్తున్న మరో లారీ వెనుక నుండి గుద్దుకుంది. డ్రైవర్లు వేగం నియంత్రించినందున ప్రమాదంలో చిక్కుకున్న వారంతా స్వల్ప గాయాలతో బయటపడ్డారు. బాధితులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.
ఇదీ చూడండి: ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టిన లారీ, ఇద్దరు మృతి