కరీంనగర్లోని వెంకటేశ్వర ఆలయంలో తొమ్మిది రోజుల పాటు నిర్వహించిన బ్రహ్మోత్సవాల అనంతరం నయనానందకరంగా శోభాయాత్రను నిర్వహించారు. బీసీ సంక్షేమశాఖ మంత్రి గంగుల కమలాకర్ మార్క్‌ఫెడ్ గ్రౌండ్‌లో కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. ఈ శోభాయాత్ర.. రాంనగర్, మంకమ్మతోట, గీతాభవన్ మీదుగా సాగింది. భక్తులు శోభాయాత్రను చూసి పరవశించిపోయారు.
కరీంనగర్లో వైభవంగా వెంకటేశ్వర శోభాయాత్ర - కరీంనగర్ వార్తలు
కరీంనగర్లో వెంకటేశ్వర శోభాయాత్ర కన్నులపండువగా సాగింది. వివిధ రకాల వాయిద్యాలు, నృత్యాలు భక్తులను అలరించాయి.
కరీంనగర్లో వైభవంగా వెంకటేశ్వర శోభాయాత్ర
కేరళ పంచ వాయిద్యాలు, నాదస్వర వాయిద్యాలు, చిన్న పిల్లల వేషాధారణ, దశావతారాల ప్రదర్శనలు, సింగారి మేళం, అశ్వాలు, అంబారి, మహిళల కోలాటాలు, ఒగ్గుడోలు నృత్యాలు.. దక్షిణ భారత సంస్కృతిని చాటాయి.
ఇదీ చదవండి:చీమలు గీసిన రూపం.. 'చిండీ మాత' ఆలయం!