కరీంనగర్ జిల్లాలో లాక్డౌన్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఉదయం 11 గంటలకు రహదారులన్నీ నిర్మానుష్యంగా మారాయి. ఎప్పుడూ రద్దీగా ఉండే టవర్ సర్కిల్ సైతం జనాలు లేక ప్రశాంతంగా కనిపిస్తోంది.
ప్రజలు బయటకు రాకపోయినా... పోలీసులు మాత్రం తమ విధులు నిర్వర్తించండంలో అలసత్వం ప్రదర్శించకుండా పహారా కాస్తున్నారు. ఇళ్లకు వెళ్లకుండా రోడ్ల మీదనే భోజనాలు చేస్తూ... తమ కర్తవ్యాన్ని నిర్వర్తిస్తున్నారు.