తెలంగాణ

telangana

ETV Bharat / state

ఉమ్మడి కరీంనగర్​లో పటిష్ఠంగా లాక్​డౌన్​ అమలు

ఉమ్మడి కరీంనగర్​ జిల్లాలో లాక్​డౌన్​ను పకడ్బందీగా అమలు చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా కొవిడ్​-19 కేసులు తగ్గినప్పటికీ ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. సరి, బేసి విధానంలో షాపులను తెరిచేందుకు అనుమతిస్తున్నారు.

By

Published : May 7, 2020, 4:41 PM IST

ఉమ్మడి కరీంనగర్​లో పటిష్ఠంగా లాక్​డౌన్​ అమలు
ఉమ్మడి కరీంనగర్​లో పటిష్ఠంగా లాక్​డౌన్​ అమలు

ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో కొత్త కేసులు నమోదు కాకపోయినా లాక్‌డౌన్ నిబంధనలు కఠినంగా అమలు చేస్తున్నారు. ఉమ్మడి కరీంనగర్​లోని కరీంనగర్‌, రాజన్న సిరిసిల్ల జిల్లాలు ఆరెంజ్‌ జోన్‌లో కొనసాగుతున్నాయి. పెద్దపల్లి జిల్లా గ్రీన్‌జోన్‌లో కొనసాగుతోంది. ప్రస్తుతం కరీంనగర్‌లో ఒకటి, వేములవాడలో మూడు, జగిత్యాల జిల్లాలో ఒక కేసు యాక్టివ్‌గా ఉంది. జగిత్యాల జిల్లా తక్కళ్లపల్లి గ్రామాన్ని కంటైన్మెంట్ జోన్‌గా పరిగణిస్తున్నారు. ప్రభుత్వం లాక్‌డౌన్‌ నిబంధనలను సడలించిన దృష్ట్యా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఏ కేటగిరిలోని షాపులను తెరిచేందుకు అనుమతిస్తున్నారు.

బీ కేటగిరిలో ఉన్నషాపులను మాత్రం సరి, బేసి విధానంతో తెరిచేలా ప్రణాళిక అమలు చేస్తున్నారు. రెండో రోజూ మద్యం దుకాణాలు తెరుచుకున్నా... ఎక్కడా పెద్దగా రద్దీ కనిపించడం లేదు. ఒకవైపు కరీంనగర్​లో ఇతర రాష్ట్రాలకు చెందిన వలస కార్మికులను స్వరాష్ట్రాలకు పంపేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. మరోవైపు ఇప్పటికే తమ స్వస్థలాలకు వెళ్లేందుకు కాలినడకన బయల్దేరిన వలస కార్మికులు మాత్రం రోడ్లపై పిల్లాపాపలతో కనిపిస్తున్నారు.

ఇదీ చూడండి:హైదరాబాద్​లో అప్రమత్తంగా ఉండాలి: సీఎం కేసీఆర్​

ABOUT THE AUTHOR

...view details