జగిత్యాల జిల్లా మెట్‌పల్లిలో లాక్‌డౌన్‌ను పోలీసులు పటిష్ఠంగా అమలు చేస్తున్నారు. పట్టణంలో నాలుగు చోట్ల చెక్‌పోస్ట్‌లు ఏర్పాటు చేసి విధులు నిర్వర్తిస్తున్నారు. అనవసరంగా రోడ్లపై తిరిగే వారిపై చర్యలు తీసుకుంటున్నారు. ద్విచక్ర వాహనాలపై ఒకరు వెళ్లడానికి మాత్రమే అనుమతిస్తున్నారు.
మెట్‌పల్లిలో లాక్‌డౌన్ పటిష్ఠంగా అమలు - మెట్‌పల్లి లా క్‌డౌన్ జాతావార్తాలు
కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ప్రభుత్వం ప్రకటించిన లాక్‌డౌన్‌ను మెట్‌పల్లి పోలీసులు కట్టుదిట్టంగా అమలు చేస్తున్నారు. రోడ్లపైకి వస్తున్న ప్రజలకు కరోనా వైరస్ వ్యాప్తిపై అవగాహన కల్పిస్తున్నారు.
మెట్‌పల్లిలో లాక్‌డౌన్ పటిష్ఠంగా అమలు
ద్విచక్రవాహనాలపై ఒకరికి మించి వెళ్ళినా, అనవసరంగా రోడ్లపై తిరుగుతున్న వారిపై కేసులు నమోదు చేసి వాహనాలు స్వాధీనం చేసుకుంటున్నారు. లాక్‌డౌన్‌లో పాల్గొని పోలీసులకు సహకరించాలని ఆధికారులు ప్రజలను సూచిస్తూన్నారు.
ఇదీ చూడండి:ప్యాసివ్ ఇమ్యూనిటీ ద్వారా కరోనా చికిత్స: డా.రఘుకిశోర్