కరీంనగర్లో లాక్ డౌన్ పరిస్థితులను సీపీ కమలాసన్ రెడ్డి స్వయంగా పరిశీలించారు. నగరంలోని ప్రధాన రహదారులన్నీ నిర్మానుష్యంగా మారాయి. అదేవిధంగా వీధుల్లో బయట తిరిగే వారిని గుర్తించేందుకు డ్రోన్ల ద్వారా సీపీ పర్యవేక్షించారు.
కరీంనగర్లో లాక్ డౌన్.. డ్రోన్ కెమెరాలతో పర్యవేక్షణ - కరీంనగర్లో డ్రోన్ పర్యవేక్షణ
లాక్ డౌన్ అమలుతో కరీంనగర్లో రహదారులన్నీ బోసిపోయాయి. అన్నీ ప్రధాన రహదారులతో పాటు వీధుల వెంట బయట తిరిగేవారిని గుర్తించేందుకు డ్రోన్ కెమెరాలతో సీపీ కమలాసన్ రెడ్డి స్వయంగా పర్యవేక్షించారు.
కరీంనగర్లో రహదారులను డ్రోన్ కెమెరాలతో పర్యవేక్షణ
ప్రభుత్వం ఇచ్చిన సడలింపుల విషయంలో ప్రజలను ఇబ్బంది పెట్టవద్దని అధికారులను సీపీ ఆదేశించారు. ప్రభుత్వ నిబంధనలను ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాటించాలని ఆయన సూచించారు.