కరోనా వైరస్ వ్యాప్తిని కట్టడి చేసేందుకు రాష్ట్ర సర్కార్ ప్రకటించిన లాక్డౌన్కు కరీంనగర్ వాసులు మద్దతు తెలిపారు. ప్రజలంతా ఇళ్లకే పరిమితమవ్వడం వల్ల నగర రహదారులు, బస్టాండ్లు నిర్మానుష్యంగా మారాయి.
కరీంనగర్లో కొనసాగుతున్న లాక్డౌన్ - corona virus latest news
ప్రపంచాన్ని గడగడలాడిస్తోన్న కరోనా వైరస్ వ్యాప్తిని నివారించేందుకు కరీంనగర్ అధికారులు అప్రమత్తమయ్యారు. రాష్ట్రంలో లాక్డౌన్ ప్రకటించిన నేపథ్యంలో నగరంలోని రహదారులు, బస్టాండ్లు నిర్మానుష్యంగా కనిపిస్తున్నాయి.
కరీంనగర్లో కొనసాగుతున్న లాక్డౌన్
కిరాణా దుకాణాలు, మందుల షాపుల మినహా వ్యాపార సముదాయాలు, హోటళ్లు, షాపింగ్ మాళ్లు ఎక్కడికక్కడ మూసివేశారు. పెట్రోల్ బంకులు యథావిధిగా నడుస్తున్నాయి.
సీఎం ఆదేశాలు పెడచెవిన పెడుతూ రోడ్ల మీద సంచరిస్తున్న ఆటో డ్రైవర్లను పోలీసులు హెచ్చరించారు. ప్రభుత్వ ఆదేశాలు పాటించకుండా రోడ్లపైనకు వస్తోన్న వారి వాహనాలను సీజ్ చేస్తున్నారు.
- ఇదీ చూడండి :కరోనా భయంతో విమానం నుంచి కిందకు దూకిన పైలట్