తెలంగాణ

telangana

ETV Bharat / state

MLC Elections Voting : ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటేసిన ప్రముఖులు

MLC Elections Voting : స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్​ ప్రశాంతంగా కొనసాగుతోంది. మొత్తం 12 స్థానాలకు 6 స్థానాలు ఇప్పటికే ఏకగ్రీవం కాగా.. మరో 6 స్థానాలకు ఇవాళ పోలింగ్​ జరుగుతోంది. ఐదు ఉమ్మడి జిల్లాల్లో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్​ కొనసాగుతోంది. పలువురు ప్రముఖులు పలు జిల్లాల్లో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

MLC Elections 2021: ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటేసిన ప్రముఖులు
MLC Elections 2021: ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటేసిన ప్రముఖులు

By

Published : Dec 10, 2021, 12:22 PM IST

Updated : Dec 10, 2021, 1:32 PM IST

MLC Elections Voting : రాష్ట్రంలోని ఐదు ఉమ్మడి జిల్లాల్లో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్​ ప్రశాంతంగా సాగుతోంది. సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్​ జరగనుంది. ఇప్పటికే పలువురు ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

ఓటేసిన మంత్రి కేటీఆర్​

ఓటు హక్కును వినియోగించుకునేందుకు వెళ్తున్న మంత్రి కేటీఆర్​

Telangana MLC Elections Voting : రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రం వద్ద ఎక్స్ అఫీషియో సభ్యులు, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్​ తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. అలాగే క్యాంపునకు తరలివెళ్లిన ఎంపీటీసీలు, జడ్​పీటీసీ సభ్యులు నేరుగా పోలింగ్ కేంద్రం వద్దకు చేరుకుని ఓటేశారు.

ఓటేసిన మంత్రులు హరీశ్​రావు, జగదీశ్​ రెడ్డి

ఓటేసిన మంత్రి హరీశ్​, ఎంపీ ప్రభాకర్​రెడ్డి

స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా మంత్రి హరీశ్​ రావు ఓటు హక్కును వినియోగించుకున్నారు. ప్రజా ప్రతినిధులందరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని మంత్రి సూచించారు. సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో మంత్రి హరీశ్​రావుతో పాటు ఎంపీ కొత్త ప్రభాకర్​ రెడ్డి ఓటేశారు. సూర్యాపేటలో మంత్రి జగదీశ్‌రెడ్డి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

ఓటు వేసిన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి

ఓటు హక్కు వినియోగించుకుంటున్న మంత్రి ఇంద్రకరణ్​

Telangana MLC Elections Polling : శాసన మండలి స్థానిక సంస్థల కోటా ఎన్నికల్లో విజయం తమదేనని, తెరాస ఎమ్మెల్సీ అభ్యర్థి దండే విఠల్ భారీ మెజార్టీతో గెలవబోతున్నారని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా నిర్మల్ జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్ కార్యాలయంలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఓటు హక్కును వినియోగించుకున్నారు. మంత్రి ఇంద్రకరణ్ రెడ్డితో పాటు పలువురు ప్రజాప్రతినిధులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

KTR Voted in MLC Elections : మంచిర్యాల జిల్లా కేంద్రంలోని జిల్లా ప్రజా పరిషత్ కార్యాలయంలో జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో జిల్లా జడ్పీ ఛైర్​పర్సన్​ నల్లాల భాగ్యలక్ష్మి, ప్రభుత్వ విప్ బాల్క సుమన్, మంచిర్యాల శాసనసభ్యులు దివాకర్ రావు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

ఖమ్మంలో ఓటేసిన ఎంపీ నామ, సీఎల్పీ నేత భట్టి

ఓటు వేస్తున్న ఎంపీ నామ
ఓటేస్తున్న సీఎల్పీ నేత భట్టి విక్రమార్క

ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కు ఎంపీ నామ నాగేశ్వరరావు, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఓటు వేశారు.

ఓటు వేసిన మంత్రి గంగుల

కరీంనగర్ జిల్లా పరిషత్ పోలింగ్ కేంద్రంలో మంత్రి గంగుల కమలాకర్, ఎమ్మెల్యేలు సుంకె రవి శంకర్, రసమయి బాలకిషన్, మేయర్ సునీల్ రావు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. సూర్యాపేట జిల్లా హుజూర్​నగర్​లోని ప్రభుత్వ పాఠశాలలో ఎమ్మెల్యే సైదిరెడ్డి ఓటు వేశారు.

ఇదీ చదవండి:

MLC Election Polling 2021 : కొనసాగుతున్న స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్

Last Updated : Dec 10, 2021, 1:32 PM IST

ABOUT THE AUTHOR

...view details