కరీంనగర్‌లో మద్యం దుకాణాల కేటాయింపులో(Liquor tenders in Karimnagar) ఉద్రిక్తత చోటు చేసుకొంది. ఆరో నెంబర్ దుకాణం కేటాయించకుడా ఆలస్యం చేస్తున్నారంటూ అధికారుల తీరుపై పలువురు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో అధికారులకు, దరఖాస్తుదారులకు మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో వారిని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో కాసేపు ప్రక్రియ నిలిచిపోయింది. జిల్లాలోని 94 మద్యం దుకాణాలను లక్కీ డ్రా ద్వారా కేటాయించారు.
ఆరో నంబర్ షాపు కేటాయింపు చేయకుండా అధికారులు తాత్సారం చేయడంతో దరఖాస్తుదారులు అభ్యంతరం చెప్పారు. దరఖాస్తు చేసుకున్న వారిలో ఒకరు గైర్హాజర్ కావడంతోనే ఆ దుకాణం డ్రా(telangana liquor tender 2021) తీయకుండా పక్కన పెట్టినట్లు అధికారులు తెలిపారు. అయితే దరఖాస్తుదారులంతా అతని నంబర్ తొలగించి మిగతా వారి నంబర్లతో డ్రా తీయాలని డిమాండ్ చేశారు.
కలెక్టర్ వార్నింగ్
అధికారులు మాత్రం ఇంకా 24 గంటల సమయం ఉంటుందని చెప్పడంతో దరఖాస్తుదారులు(liquor shop tender in telangana 2021) అభ్యంతరం తెలిపారు. అధికారులతో వాగ్వాదానికి దిగగా పోలీసులు వారిని అడ్డుకోవడంతో లక్కీ డ్రా కాస్త వివాదాస్పదంగా మారింది. మేము కోట్ల రూపాయల పెట్టి దరఖాస్తులు చేసుకుంటే మమ్మల్ని బయటికి నెట్టేయడం ఏంటని అధికారులను నిలదీశారు. మీ ఇష్టం ఉన్నప్పుడు డ్రా తీసుకోండని మేము పాల్గొనమంటూ దరఖాస్తుదారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో వారంతా బయటికి వెళ్లిపోతుండగా జిల్లా కలెక్టర్ ఆర్వీ కర్ణన్ నచ్చచెప్పారు. ఆ షాపు డ్రా పూర్తయ్యే వరకు మిగతా వాటిని కూడా నిలిపివేయాలని అడ్డుకోవడాన్ని కలెక్టర్ ఆర్వీ కర్ణన్ తప్పుబట్టారు. ఎవరైనా ఈ ప్రక్రియను అడ్డుకొంటే కేసులు నమోదు చేస్తామనడంతో గొడవ సద్దుమణిగింది.