హూజూరాబాద్ అసెంబ్లీ నియోజక వర్గంలో మద్యం అమ్మకాలు జోరందుకున్నాయి (Huzurabad By Election Liquor Sales). భారీ ఎత్తున విక్రయాలు జరుగుతున్నాయి. రాజకీయ పార్టీ ప్రచారాలు ఊపందుకోవడంతో మద్యానికి డిమాండ్ పెరిగింది (Liquor Sales in Huzurabad). ఇప్పటికే మూడు పార్టీలకు చెందిన నాయకులు అక్కడే మకాం వేశారు. ఊరూరా, గడపగడపకు తిరుగుతూ ప్రచారం నిర్వహిస్తున్నారు. బయట ప్రాంతాలకు చెందిన నాయకులు, ఆయా పార్టీల శ్రేణులు అక్కడే మకాం వేయడంతో సాధారణ... అమ్మకాల కంటే ఎక్కువ అమ్ముడు పోతోందని ఎక్సైజ్ అధికారులు అభిప్రాయపడుతున్నారు.
రెండు వారాల్లో భారీగా పెరిగిన అమ్మకాలు
నియోజక వర్గంలో ఇల్లందుకుంట, హుజూరాబాద్, జమ్మికుంట, వీనవంక మండలాలు కరీంనగర్ జిల్లా పరిధిలో ఉండగా కమలాపూర్ మండలం మాత్రం హనుమకొండ పరిధిలో ఉంది. ఉప ఎన్నికల షెడ్యూల్ విడుదలైన తర్వాత... నియోజకవర్గంలో మద్యం విక్రయాలు అంతకు ముందు కంటే ఎక్కువ జరుగుతున్నాయి (Huzurabad By Election Liquor Sales). సెప్టెంబరు నెలలో మొదటి రెండు వారాల్లో కరీంనగర్ జిల్లాలో రూ.63.82 కోట్లు విలువైన మద్యం అమ్ముడుపోగా... వరంగల్ జిల్లాలో రూ.71.18 కోట్లు విలువైన మద్యం విక్రయాలు జరిగాయి ( Liquor Sales in Huzurabad).
వంద కోట్లు దాటిన అమ్మకాలు