తెలంగాణ

telangana

ETV Bharat / state

KALESHWARAM PROJECT: కాళేశ్వరం...లిఫ్టింగ్‌ ఏ రివర్‌ డాక్యుమెంటరీ - 1.5 tmc water lift in gayathri pump house

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టుపై ప్రముఖ ఛానల్‌ డిస్కవరీ ప్రత్యేక డాక్యుమెంటరీని ప్రసారం చేయనుంది. 25వ తేదీ రాత్రి 8గంటలకు ఈ డాక్యుమెంటరీ ప్రసారం చేశారు.

కాళేశ్వరం ప్రాజెక్టులో రోజుకు 1.5 టీఎంసీల ఎత్తిపోతలు
కాళేశ్వరం ప్రాజెక్టులో రోజుకు 1.5 టీఎంసీల ఎత్తిపోతలు

By

Published : Jun 25, 2021, 9:31 AM IST

Updated : Jun 26, 2021, 1:06 PM IST

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టుపై ప్రముఖ ఛానల్‌ డిస్కవరీ ప్రత్యేక డాక్యుమెంటరీని ప్రసారం చేయనుంది. 25వ తేదీ రాత్రి 8గంటలకు ఈ డాక్యుమెంటరీ ప్రసారం చేశారు. లిఫ్టింగ్‌ ఏ రివర్‌ డాక్యుమెంటరీపేరిట కొండపల్లి రాజేంద్ర శ్రీవత్స రూపొందిచారు. కాళేశ్వరం ప్రాజెక్టులోని గాయత్రి పంప్ హౌస్ నుంచి రోజుకు 1.5 టీఎంసీల గోదావరి నదీ జలాల ఎత్తిపోతలను చేపట్టారు. కరీంనగర్ జిల్లా రామడుగు మండలం లక్ష్మీపూర్​లోని గాయత్రి పంప్ హౌస్​లో ఐదు బాహుబలి పంపులను ఎత్తిపోతలకు వినియోగిస్తున్నారు. ఇక్కడి నుంచి సుమారు 16 వేల క్యూసెక్కుల నీటిని సహజ ప్రవాహం ద్వారా మధ్య మానేరు ప్రాజెక్టుకు తరలిస్తున్నారు.

అక్కడి నుంచి దిగువ మానేరు ప్రాజెక్టుకు జలాలను విడుదల చేశారు. గాయత్రి పంప్ హౌస్ నుంచి ఎస్సారెస్పీ వరద కాలువ గుండా మధ్య మానేరు ప్రాజెక్టు వరకు భారీ ప్రవాహం కనువిందు చేస్తోంది.

ఇదీ చూడండి:నేటి నుంచి విధుల్లోకి ఉపాధ్యాయులు, అధ్యాపకులు

Last Updated : Jun 26, 2021, 1:06 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details