తెలంగాణ

telangana

ETV Bharat / state

సాంఘిక సంక్షేమ హాస్టళ్ల సమస్యలపై గవర్నర్​కు లేఖ - LETTER TO GOVERNOR ON GOVT_HOSTELS

రాష్ట్రంలోని సాంఘిక సంక్షేమ వసతి గృహాల్లో ఏర్పడ్డ ఎన్నో సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని మాదిగ విద్యార్థి సమాఖ్య డిమాండ్​ చేసింది. అన్ని హాస్టళ్లపై రిపోర్టు తయారు చేసి గవర్నర్​కు లేఖ రాయనున్నట్లు తెలిపారు.

LETTER TO GOVERNOR ON GOVT_HOSTELS

By

Published : Aug 6, 2019, 7:15 PM IST

సాంఘిక సంక్షేమ వసతి గృహాల్లో కనీస మౌలిక వసతులను కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మాదిగ విద్యార్థి సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు ఉపేందర్ కరీంనగర్​లో ఆరోపించారు. సాంఘిక సంక్షేమ వసతి గృహాలు శిథిలావస్థలో ఉన్నాయని... వెంటనే నూతన భవనాలను నిర్మించాలని డిమాండ్ చేశారు. వసతిగృహంలో నెలకొన్న సమస్యలపై గవర్నర్​కు లేఖ రాస్తామని ఉపేందర్​ తెలిపారు.

సాంఘిక సంక్షేమ హాస్టళ్ల సమస్యలపై గవర్నర్​కు లేఖ

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details